
పశువుల గర్భధారణ పరికరాలు పంపిణీ చేస్తున్న జేడీ డాక్టర్ బేబీ రాణి
జే.పంగులూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక శనివారం మండల పరిధిలోని బూదవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ ఎంపిక కార్యక్రమం పాఠశాల హెచ్‌ఎం బంగారు కొండ, పీడీ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. 12 నియోజకవర్గాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–17, అండర్–14 విభాగాల్లో బాలబాలికలకు సంబంధించిన నాలుగు జట్లను ఎంపిక చేసినట్లు ఎస్‌ఏపీఈ అసోసియేషన్ సెక్రటరీ నత్తన కృష్ణ, సభ్యులు వేణుగోపాల్ వెంకట్రావు తెలిపారు. క్రీడాకారుల ఎంపికను పీడీలు స్వరూపారాణి, శేషగిరి, రమేష్, సుబ్బలక్ష్మి, వెంకట్రావు ఎంపిక చేశారు. జట్టుకు 16 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు సింగరాయకొండ విద్యార్థిని
సింగరాయకొండ: మండలంలోని పాతసింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని చిమట తులసి అండర్–14 విభాగంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్ పద్మజ తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 15వ తేదీ అండర్–14 హాకీ పోటీల జిల్లా జట్ల ఎంపికలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచిన తులసి జిల్లా జట్టుకు ఎంపికై ంది. జిల్లా జట్టుకు ఎంపికై న తులసిని వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.అన్వర్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ చిమట సుధాకరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.
పశువుల కృత్రిమ గర్భధారణ పరికరాల పంపిణీ
ఒంగోలు సబర్బన్: పశువుల కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కంటైనర్లు, పరికరాలను జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి పంపిణీ చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చీమకుర్తి మండలానికి చెందిన రైతు భరోసా కేంద్రాలు కేవీ పాలెం, ఇలపావులూరు, పి.నాయుడు పాలెం, మంచికలపాడు, చినరావిపాడు సిబ్బందికి అందజేశారు. ఆదివారం నుంచి ఆయా గ్రామాల్లో పాడి రైతులు, పశు వైద్య సహాయకుల ద్వారా కృత్రిమ గర్భధారణ సౌకర్యం కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పాడిరైతులు ఆర్థికంగా లబ్ధిపొందాలని జేడీ బేబీరాణి కోరారు. కార్యక్రమంలో పశువైద్యులు షేక్ కాలేషా, కోసూరి రాధ, పశు వైద్యులు కృపారావు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ రాజేశ్వరితో పాటు పలువురు పాల్గొన్నారు.

ఎంపికైన తులసిని అభినందిస్తున్న దృశ్యం

బూదవాడ గ్రామంలో ఎంపికలో పాల్గొన్న క్రీడాకారులు