పరిషత్‌ సమరానికి సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ సమరానికి సిద్ధం!

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

పరిషత్‌ సమరానికి సిద్ధం!

పరిషత్‌ సమరానికి సిద్ధం!

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు
● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్‌ స్టేషన్ల రూట్‌మ్యాప్‌లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్‌ ?

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్‌బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్‌కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్‌కు పంపారు.

జోరుగా ఏర్పాట్లు..

ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్‌ స్టేషన్ల రూట్‌ మ్యాపింగ్‌ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్‌ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు

జిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ

స్థానాలు స్థానాలు

కరీంనగర్‌ 170 15

జగిత్యాల 216 20

పెద్దపల్లి 140 13

రాజన్నసిరిసిల్ల 123 12

మొత్తం 649 60

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement