
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు ఇలా..
నాటి అల్లకొండనే నేటి బాల్కొండ
మీకు తెలుసా?
మీ కోసం
రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన బాల్కొండ ఒకనాటి అల్లకొండ. క్రీ.శ 1059లో సంధికాలంలో ఏర్పడ్డ అల్లకొండను, అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు పాలించడంతో ముందుగా అల్లకొండగా పేరొందింది.
● కాలక్రమేనా అల్లకొండ క్రీ.శ 1422 తర్వాత బాల్కొండగా పిలువబడుతూ ప్రస్తుతం బాల్కొండ మండల కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా చెలామణి అవుతోంది.
● అల్లయ్య, కొండయ్యలు పాలించారనడానికి నిదర్శనంగా వారి విగ్రహలు ఇప్పటికీ బాల్కొండ ఖిల్లాలో ఉన్నాయి.
● యుద్ధ పోరాటంలో బహమనీ సుల్తానులు వాళ్ల కాళ్లు, చేతులు నరికి వేశారు. దీంతో వారి విగ్రహాలు కూడా కాళ్లు, చేతులు లేకుండానే ఉండడం విశేషం. – బాల్కొండ
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. ఐతే, ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత ఏమిటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే పత్రాలు అవసరం? అనే వివరాలు మీ కోసం...
● రేషన్ కార్డుకు ప్రధాన అర్హత వార్షిక ఆదాయ ధ్రువీకరణ. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదు.
● మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు కుటుంబసభ్యుల ఆధార్ కార్డులు, ఇంటి యజమాని కరెంట్ బిల్లు, గ్యాస్ సిలిండర్ పుస్తకం దరఖాస్తుకు జత చేయాలి. ఉంటే ద్విచక్ర వాహన ఆర్‌సీ లేదంటే ఓటరు కార్డు జిరాక్సు పెట్టాలి.
● దరఖాస్తు పూర్తయిన తర్వాత దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేస్తే అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో పంపుతారు. అనుకూలత మేరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేస్తుంది.
● కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నా కొత్త రేషన్‌కార్డుకు అనర్హులే.
● ఇప్పటికే రేషన్‌కార్డు ఉండి అందులో కుటుంబసభ్యుల పేర్లు చేర్పులు, మార్పులు చేయాలంటే సంబంధితుల ఆధార్ కార్డు దరఖాస్తుకు జత చేయాలి.
– డొంకేశ్వర్(ఆర్మూర్)

కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు ఇలా..