పర్యావరణ పరిరక్షణలో..చిత్రకారుడు | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో..చిత్రకారుడు

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 8:14 AM

మార్పు వస్తుందనే..

నా ప్రయత్నంతో ప్రజల్లో కొంత మేరకు మార్పు వస్తుందని ఆశిస్తున్నా. కంటికి కనిపించే ఖాళీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం నినాదాలు రాస్తున్నాను. కలర్‌, బ్రష్‌, నా వెంటే ఉంచుకుంటూ ఖాళీ ప్రదేశంలో నినాదాలు రాస్తాను.

– ఇందూరి బల్‌వీర్‌

వర్ని: సమాజం ఎటు పోతే నాకేంటి.. మనం బాగుంటే చాలు అనే నేటి రోజుల్లో ఓ చిత్రకారుడు పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వర్ని మండలం పాత వర్ని గ్రామానికి చెందిన ఇందూరి బల్‌వీర్‌. చిత్ర కళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఖాళీ సమయాల్లో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు గోడలు, కల్వర్టులు, రహదారుల వెంబడి ఖాళీ ప్రదేశాలల్లో పర్యావరణ పరిరక్షణ నినాదాలు రాస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నాడు.

పర్యావరణ పరిరక్షణలో..చిత్రకారుడు 1
1/1

పర్యావరణ పరిరక్షణలో..చిత్రకారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement