అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం | - | Sakshi
Sakshi News home page

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

అర్గు

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

మీకు తెలుసా?
చిరుప్రాయంలో అంతర్జాతీయ గుర్తింపు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.204 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించారు.●

● 2008 మార్చి 18న వైఎస్సార్‌ స్వహస్తాలతో అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి ప్రారంభించారు.

● ఆర్మూర్‌ ప్రాంత బీసీ నాయకుడు, మాజీ మంత్రి అర్గుల్‌ రాజారాంకు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది.

● ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల పరిధిలోని మాక్లూర్‌, నందిపేట్‌, ఆర్మూర్‌, బాల్కొండ, వేల్పూర్‌, జక్రాన్‌పల్లి మండలాల్లోని 53 గ్రామాల్లో 38 వేల 792 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది.

● నందిపేట మండలం ఉమ్మెడ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోని గోదావరి నదీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుత్ప చెరువు మీదుగా ఆర్మూర్‌ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. – ఆర్మూర్‌

విద్యుత్‌ 1912

పోలీస్‌ 112,100

అగ్నిమాపక 101

అంబులెన్స్‌ 102, 108

రైల్వే విచారణ 139

అవినీతి నిరోధక శాఖ 1031

రోడ్డు ప్రమాదం 1073

సైబర్‌ క్రైమ్‌ 1930

– ఖలీల్‌వాడీ

అత్యవసర సేవల టోల్‌ ఫ్రీ నంబర్లు

ఆర్మూర్‌: ఆర్మూర్‌ పట్టణానికి చెందిన బాశెట్టి సాయి శృతి.. చిన్నతనం నుంచే ఆంధ్ర నాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. తల్లి నటరాజ నృత్యానికేతన్‌ నాట్య గురువు బాశెట్టి మృణాళిని శిష్యరికంలో ఐదేళ్ల నుంచే నాట్యాన్ని అభ్యసించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 13 ఏళ్ల సాయిశృతి తొమ్మిదో తరగతి చదువుతూ తను అనుకున్న లక్ష్యాలను సాధిస్తోంది. ఆంధ్ర నాట్యం, కూచిపూడిలో భూషణ్‌ పరీక్షలను పూర్తి చేసుకొని రెండేళ్ల డిప్లొమా సైతం పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు గోల్డెన్‌ టెంపుల్‌, కాశీ, కాణిపాకం, తిరుపతి, శ్రీశైలం, స్వర్ణగిరి, యాదగిరిగుట్ట, హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, అన్నవరం, బెంగళూరు, ఢిల్లీ, మలేషియా, దుబాయ్‌తోపాటు పలుచోట్ల సుమారు 80కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. చక్కని ప్రతిభ కనబర్చి నంది అవార్డు, కళాభారతి, నాట్య మయూరి, నాట్య విభూషణ్‌, నాట్య కుసుమం అవార్డులతోపాటు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, స్పిరిచువల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో చోటు దక్కించుకుంది. విదేశాల్లో ఉన్న చిన్నారులకు ఆన్‌లైన్‌లో నృత్యాన్ని నేర్పిస్తూ చిరుప్రాయంలోనే సహాయ నాట్య గురువుగా అవార్డును అందుకుంది.

‘లోకల్‌ టాలెంట్‌’

ఆంధ్ర నాట్యం, కూచిపూడిలో తనకంటూ ప్రత్యేకత

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 80కి పైగా ప్రదర్శనలు

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం1
1/1

అర్గుల్‌ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement