
మున్సిపాలిటీ.. జీపీ.. మున్సిపాలిటీగా..
మీకు తెలుసా?
ఏ గ్రామమైనా పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుతుంది. కానీ ఆర్మూర్ మాత్రం మొదట మున్సిపాలిటీగా, తర్వాత గ్రామ పంచాయతీగా, మళ్లీ మున్సిపాలిటీగా మారిందని ఎంత మందికి తెలుసు..
● 1956 నుంచి 1962 వరకు మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్‌కు మొదటి చైర్మన్‌గా కేవీ నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు.
● పరిపాలనా సౌలభ్యం కోసం 1962లో మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చారు.
● 44 ఏళ్ల పాటు జీపీగా ఉన్న ఆర్మూర్‌ను 2006లో 23 వార్డులతో మున్సిపాలిటీగా అభివృద్ధి చేశారు.
● కోర్టు కేసుల అనంతరం 2008 జూన్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు.
● 2014, 2019లో మున్సిపల్ ఎన్నికలు చేపట్టారు.
● 2019 ఎన్నికల్లో భౌగోళికంగా ఆర్మూర్ పట్టణానికి చుట్టూ మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న పెర్కిట్, కొటార్మూర్(హామ్లెట్ గ్రామం), మామిడిపల్లి జీపీలను మున్సిపల్‌లో విలీనం చేశారు.
● 36 వార్డులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆర్మూర్ పట్టణ పరిధి మరింత పెరిగింది.
–ఆర్మూర్