రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

Jun 2 2025 1:20 AM | Updated on Jun 2 2025 1:20 AM

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

మాక్లూర్‌: నల్గొండ జిల్లాలో ఈనెల 4, 5, 6వ తేదీ ల్లో నిర్వహించే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్‌, మెన్‌ అండ్‌ ఉమెన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారు. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికల ప్రక్రియను జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు టి విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఇటీవల సౌత్‌ జోన్‌ హ్యాండ్‌బాల్‌ నేషనల్‌ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన జిల్లాకు చెందిన సంకీర్తనను అభినందించారు. హ్యాండ్‌బాల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్‌, కోశాధికారి జీ రాజేశ్‌, పీడీలు రమణ, మాధురి, పీఈటీ సంజీవ్‌, సీనియర్‌ క్రీడాకారులు రాహుల్‌, సాయి, విష్ణు, శ్రావణిత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement