లైసెన్స్‌ రెన్యువల్‌ ఈజీగా చేసుకుందాం ఇలా.. | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ రెన్యువల్‌ ఈజీగా చేసుకుందాం ఇలా..

Jun 2 2025 1:20 AM | Updated on Jun 2 2025 1:20 AM

 లైసెన్స్‌ రెన్యువల్‌ ఈజీగా చేసుకుందాం ఇలా..

లైసెన్స్‌ రెన్యువల్‌ ఈజీగా చేసుకుందాం ఇలా..

మీకు తెలుసా?

కసారి తీసుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువులోగా రెన్యువల్‌ చేసుకోవడం చాలా మంది మరిచిపోతుంటారు. గడువు తీరిన 30 రోజుల్లోపు రెన్యువల్‌ చేయించుకోకుంటే జరిమానా విధిస్తారు. మరీ ఎక్కువ రోజులైతే రద్దు చేసే అవకాశం ఉంది.

● గతంలో ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వచ్చేది. https:// transport. telangana. gov. in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈజీగా రెన్యువల్‌ చేసుకోవచ్చు.

● ముందుగా రవాణాశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లైసెన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

● తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎంచుకుంటే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది.

● అందులో కింద ఉండే రెన్యువల్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌పై క్లిక్‌ చేయాలి.

● తర్వాత క్లిక్‌ హియర్‌ టు బుక్‌ ది స్లాట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

● మరో కొత్త విండోలో కనిపించే డ్రైవింగ్‌ లైసెన్స్‌ బాక్స్‌లోని రెన్యూవల్‌ ఆఫ్‌ లైసెన్స్‌ తర్వాత కంటిన్యూ స్లాట్‌ బుకింగ్‌ని క్లిక్‌ చేయాలి.

● తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబరు, ఎక్కడ ఇచ్చారు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు తదితర వివరాలు నమోదు చేయాలి.

● రిక్వెస్ట్‌ ఓటీపీనీ క్లిక్‌ చేస్తే మన ఫోన్‌ నంబర్‌కు ఓటీపి వస్తుంది.

● దానితో పాటు క్యాప్చర్‌ను ఎంటర్‌ చేసి గెట్‌ డీటైల్స్‌పై నొక్కగానే వివరాలన్ని కనిపిస్తాయి.

● జాగ్రత్తగా పరిశీలించి కన్‌ఫం క్లిక్‌ చేయాలి. తర్వాత పేమెంట్‌ ఆప్షన్‌ ద్వారా రుసుం చెల్లించాలి.

● ప్రింట్‌ తీసుకుని నిర్దేశించిన తేదీ రోజు ఒరిజినల్‌ లైసెన్స్‌, గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి.

● అక్కడ అధికారులు పరిశీలించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రెన్యువల్‌ చేస్తారు.

– కామారెడ్డి టౌన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement