బాజిరెడ్డి జగన్‌ జన్మదినం | - | Sakshi
Sakshi News home page

బాజిరెడ్డి జగన్‌ జన్మదినం

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 1:06 AM

బాజిరెడ్డి జగన్‌ జన్మదినం

బాజిరెడ్డి జగన్‌ జన్మదినం

సిరికొండ: బీఆర్‌ఎస్‌ రూరల్‌ నియోజకవర్గ నాయకుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌ జన్మదిన వేడుకలను మండల కేంద్రంతో పాటు రావుట్ల తదితర గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, తోట రాజన్న, దువ్వూరి సంతోష్‌ రెడ్డి, బాజిరెడ్డి రమాకాంత్‌, అన్స ర్‌, భూషణ్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కోసం స్థల పరిశీలన

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం పీఎస్‌ఆర్‌ నగర్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కోసం కేటాయించిన స్థలాన్ని శుక్రవారం టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, డీఈలు సుబ్బరాయుడు, రవికుమార్‌, తహసీల్దార్‌ గంగాధర్‌, సర్వేయర్‌ పోశెట్టి, మాజీ జెడ్పీటీసీలు శంకర్‌ పటేల్‌, పుప్పాల శంకర్‌, మాజీ ఎంపీపీ గంధపు పవన్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement