నిజామాబాద్ రూరల్: ప్రమాదవశాత్తు మృతి చెందిన గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడి కుటుంబ సభ్యులకు ప్రమాదబీమా కింద రూ. ఒక లక్ష బీమా చెక్కును అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం అందజేశారు. బ్యాంకు ఖాతాదారుడు సదా రంజిత్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా ప్రమా ద బీమా కింద రూ. ఒక లక్ష మంజూరైంది. బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు సుమన్, మర్చక నవీన్, అంకం రాజేందర్ పాల్గొన్నారు.
కవులకు సన్మానం
నిజామాబాద్ రూరల్: తెలుగు–వెలుగు సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని సీతారాంనగర్‌లో ప్రముఖ కవులు మహేశ్‌బాబు, అశోక్ గణపతిశర్మలను సమాఖ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి వీపీ చందన్‌రావు, కవులు పాల్గొన్నారు.
సీపీకి వినతిపత్రం అందజేత
నిజామాబాద్ రూరల్: విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రల అనుమతి కోసం సభ్యులు సీపీ సాయిచైతన్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అజరామర పదంలో 60 ఏళ్లు అని రూపొందించిన పుస్తకాన్ని సభ్యులు సీపీకి అందజేశారు. కార్యక్రమంలో తమల కృష్ణ, దినేశ్ ఠాకూర్, గాజుల దయానంద్, దాత్రిక రమేశ్, కోడిమల శ్రీనివాస్, నికేశ్, ఇందూరు సురేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
క్రికెట్ కిట్లు..
నిజామాబాద్‌అర్బన్: గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు నిజామాబాద్ కెనరా బ్యాంక్ రీజినల్ చీఫ్ మేనేజర్ బి చంద్రశేఖర్, రీజినల్ అసిస్టెంట్ మేనేజర్ బి శ్రీనివాస్ శుక్రవారం రెండు క్రికెట్ కిట్లను కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్‌రెడ్డికి శుక్రవారం అందజేశారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా కళాశాలకు క్రికెట్ కిట్లను అందించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, బాలమ ణి, భరత్ రాజ్, రామస్వామి, ఉదయ్ భాస్క ర్, బ్యాంక్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం
ఖలీల్‌వాడి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పి శంకర్ ఈ నెల 13న సారంగపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గ్రూప్ పర్సనల్ యాక్సి డెంట్ ఇన్సూరెన్స్ పరంగా మంజూరైన రూ. ఐ దు లక్షల చెక్కును సీపీ కార్యాలయంలో బాధిత కుటుంబానికి సీపీ అందజేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ లు జి బస్వారెడ్డి, కె రామచంద్రరావు, ఏవో అనిసాబేగం, రిజర్స్ సీఐ శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా తదితరులు ఉన్నారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఖలీల్‌వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025–26 ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులుగా సీనియర్ న్యా యవాదులు వెంకటేశ్వర్, ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్‌ల ను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్‌హాక్ కమిటీ చైర్మన్ ఆకుల రమేష్, స భ్యులు బాస రాజేశ్వర్, నరసింహరెడ్డి, శ్రీహరి ఆచార్య ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, క్రీడా కార్యదర్శి, సాంస్కతిక కార్యదర్శి, కోశాధికారి పదవులతో పాటు కార్యవర్గ సభ్యుల పదవులకు మార్చి 22 నుంచి 26వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. 27న నామినేషన్ పత్రాల పరిశీలన, 28న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 4న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఉద యం పది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు న్యాయవాదులు తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు.
బీమా చెక్కు అందజేత
బీమా చెక్కు అందజేత