
విద్యుత్ సీఎండీ గోపాల్‌రావు జిల్లాలో పెండింగ్ బిల్లుల విషయంలో జిల్లా అధికారులపై సమీక్ష ల్లో, ఫోన్లలో అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. జిల్లాస్థాయి అధికారులు తమ కిందిస్థా యి అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు నేరుగా సామాన్యుల ఇళ్లకు వెళ్లి జులూం చేసేవారు. రూ. 500 కట్టకున్నా కరెంట్ పీకేసేవారు. సామాన్యులు భయపడుతూ మరీ కార్యాలయానికి వెళ్లి బిల్లులు కట్టేవారు. అలాంటిది ఓ మాజీ ప్రజాప్రతినిధి రూ. కోట్లల్లో విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్మూర్ పట్టణంలోని జీవన్‌రెడ్డి మాల్