
సమన్వయంతో పని చేయాలి
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం పాటించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. జిల్లాలో ఆర్‌ఎఫ్‌ఆర్ (రైట్‌ఫుల్ ఫారెస్ట్ రూల్స్) అమలుపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచా యతీరాజ్‌శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బ్రిడ్జిలు, విద్యుత్ తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు అటవీశాఖకు సరైన విధంగా ప్రపోజల్స్ సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రతీ శాఖ తమ ప్రపోజల్స్‌ను అటవీశాఖతో సమన్వ యం చేసుకుని ముందుగా ఆమోదం పొందాలని సూచించారు. చేపట్టనున్న అభివద్ధి ప్రాజెక్టులను త్వరగా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. శాఖల మధ్య సమన్వయంతో అభివద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తిచేయాలని, అ టవీశాఖ అవసరమైన మార్గదర్శకాలకు సంబంధి త శాఖలకు త్వరగా పంపించాలని సూచించారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ తదితరులున్నారు.
భూసమస్యలు పరిష్కరించాలి
కుంటాల: భూభారతి పథకానికి కుంటాల మండలాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం భూభారతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సమస్యల దరఖాస్తులు, ఆన్‌లైన్ ప్రక్రియ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు కమల్‌సింగ్, శ్రీకాంత్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ప్రవీణ్‌కుమార్, డీటీ నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.