నా కానుకల ఈ–వేలంలో పాల్గొనండి: మోదీ 

Narendra Modi Urges People To Take Part In Auction Of Gifts Received By Him - Sakshi

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా తనకు వచ్చిన కానుకలు, మెమెంటోలను ఈ–వేలం వేస్తున్నామని అందులో పాల్గొని కొనుగోలు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ బహుమతులు అమ్మగా వచ్చిన డబ్బులన్నీ గంగానదిని ప్రక్షాళనకు ఉద్దేశించిన నమామి గంగే ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. 

‘‘గత కొద్ది ఏళ్లుగా నాకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారు. మన ఒలింపిక్‌ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్‌ ద్వారా వేలం వేస్తున్నాం. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ఈ–వేలంలో వచ్చిన డబ్బుల్ని గంగానది శుద్ధి చేయడానికి వినియోగిస్తాం’’ అని ప్రధాని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజుని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ కానుకలు వేలం వెయ్యడం మొదలు పెట్టింది. అక్టోబర్‌ 7 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ వేలంలో వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే http://pmmementos.gov.in  అనే వెబ్‌సైట్‌ ద్వారా వేలంలో పాల్గొనవచ్చు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top