Double Decker Buses Collided On UP Expressway: Several Killed - Sakshi
Sakshi News home page

UP Massive Accident: డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీ.. 8 మంది మృతి

Jul 25 2022 8:33 AM | Updated on Jul 25 2022 9:28 AM

Double Decker Buses collided On UP Expressway several killed - Sakshi

రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీకొన్న దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీ హైదర్‌గఢ్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని లక్నోలోని ట్రూమా సెంటర్‌కు తరలించామని వెల్లడించారు.

ప్రమాదానికి గురైన రెండు బస్సులు బిహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో బారబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ‘లోనికాత్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నరేంద్రపుర్‌ మద్రాహా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులు బిహార్‌లోని సీతామర్హి, సుపాల్‌ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ’ అని ఓ అధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి: Teacher recruitment scam: ‘ఆ మంత్రి డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement