
గ్రిల్‌లో ఇరుక్కుని నరకయాతన
ఎమ్మిగనూరురూరల్: వైద్యం కోసం వచ్చిన మహిళ కాలు ఆస్పత్రి గేటు వద్ద గ్రిల్‌లో ఇరుక్కోవడంతో అరగంట పాటు నరకయాతన అనుభవించింది. వివరాలు.. మండల పరిఽధిలోని కోటేకల్ గ్రామానికి చెందిన మునెమ్మ అనే మహిళ కాలికి దెబ్బతగడంతో చికిత్స కోసం శుక్రవారం ఎమ్మిగనూరు ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. కట్టు కట్టించుకొని బయటకు నడిచి వస్తుండగా ఆటో ఎదురుగా రావటంతో గ్రిల్ మీద నిల్చున్న మహిళ కాలు జారి ప్రమాదశాత్తు ఇరుక్కుపోయింది. దెబ్బతగిలిన కాలు గ్రిల్‌లో ఇరుక్కొని కేకలు వేయటంతో అక్కడి వారు వచ్చి ఎంతగా ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. చివరకు ఇనుప కడ్డీలు కట్ చేసే కట్టర్‌ను తీసుకొచ్చి గ్రిల్ కడ్డీని కట్ చేసి మహిళను బయటకు తీశారు. ప్రభుత్వాసుపత్రిలోకి ఆటోలు, అంబులెన్స్‌లు ఇష్టానుసారంగా వస్తుండంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి గేటు వద్ద పాడైపోయిన గ్రిల్‌ను బాగు చేయించాలని రోగులు, ప్రజలు కోరుతున్నారు.