నిధులు లేక నిరాశ.. | Sakshi
Sakshi News home page

నిధులు లేక నిరాశ..

Published Sun, Apr 14 2024 1:30 AM

-

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లింపు పంచాయతీలకు భారంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు పది నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం అందించే నిధులు రెండు, మూడు నెలలకోసారి వస్తున్నా.. అవి ఏమూలకూ చాలడం లేదని తెలుస్తోంది. గతంలో సర్పంచుల పాలనలో ప్రభుత్వం నుంచి సమయానికి నిధులు అందకపోయినా.. వారి సొంత నిధులు, అప్పుచేసి మరీ నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారులు నిధులు లేవని సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్య అధికమైందని.. చాలాచోట్ల ప్రత్యేకాధికారులు నెలకు ఒక్కసారైనా గ్రామాలకు రావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
Advertisement