కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన టాస్క్ వర్క్‌షాపు మంగళవారం ముగిసింది. వర్క్‌షాపునకు హాజరైన వందమంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమ య్యే అంశాల గురించి వర్క్‌షాపు కన్వీనర్ వెంకట య్య, రీసోర్స్‌పర్సన్ టి.వెంకటేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె.మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ రామరాజుయాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంలో తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఆటిట్యూట్ తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉదయ్‌కుమార్, స్వర్ణలత, రమేష్‌కుమార్, కుర్మయ్య, సోఫిపాషా, శివుడు, స్వామిసాగర్, కవిత తదితరులు పాల్గొన్నారు.