
చెన్నిపాడులో కుప్పగా పోసిన ఎండు మిర్చి
గోకులపాడు సింజంటబేడీ రకం మిర్చి సాగు
కందనూలు: తమ గ్రామాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో అభివృద్ధి పర్చుకున్నందుకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని, మిగతా గ్రామాలు సైతం వీటిని ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీచైర్‌పర్సన్ శాంతకుమారి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి అధ్యక్షతన జాతీయ పంచాయతీ అవార్డులు–2022 ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీచైర్‌పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలు రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి అన్ని అంశాల్లో అవార్డులు పొందాలన్నారు. ఇందుకు గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను అధిగమించి వివిధ థీమ్‌లలో కష్టపడి తమ గ్రామ అభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయమని, వారందరికీ అభినందనలు తెలిపారు. అన్ని విభాగాల్లో జిల్లా నుంచి వందశాతం లక్ష్యాన్ని 4 గ్రామ పంచాయతీలైన అల్లపూర్, జూపల్లి, వస్రాం తండా, ఎరవ్రల్లి చేరుకున్నాయన్నారు. ఈమేరకు అల్లపూర్ పేరును రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగిందన్నారు. అంతకుముందు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై న సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి అవార్డులు, మెమోంటోలు ప్రదానం చేసి, సన్మానించారు. డీపీఓ కృష్ణ, జెడ్పీ సీఈఓ ఉషా, డీఆర్‌డీఓ నర్సింగ్‌రావు, డీడబ్ల్యూఓ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ శాంతకుమారి
ఘనంగా జాతీయ పంచాయతీ
అవార్డుల ప్రదానోత్సవం