మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షలు మరో రెండు రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు పేపర్ వ్యాల్యువేషన్‌కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పేపర్ వ్యాల్యువేషన్ క్యాంపును మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేపట్టారు. ఆదివారం నుంచి సంస్కృతి సబ్జెక్టు పేపర్ వ్యాల్యువేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ జిల్లాల నుంచి సంస్కృతి సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 23,831 పేపర్లు వచ్చాయి. ఇందులో మొదటి సంవత్సరం 13,321, రెండో సంవత్సరం 10,510 పేపర్లు ఉన్నాయి. వచ్చిన పేపర్లకు మొదట కోడింగ్ ప్రక్రియ చేసిన అనంతరం లెక్చరర్లతో వ్యాల్యువేషన్ చేసేందుకు ఇవ్వనున్నారరు. వ్యాల్యువేషన్ మొదటిరోజు మొత్తం 26 మంది లెక్చరర్లు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను డీఐఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. రోజుల వారీగా జవాబు పత్రాలు క్యాంపునకు చేరుకుంటున్నాయని, సబ్జెక్టుల వారీగా వ్యాల్యువేషన్‌కు హాజరుకావాల్సిన లెక్చరర్లకు నేరుగా బోర్డు నుంచి ఆర్డర్లు వెళ్తాయని, వారు తప్పకుండా విధులకు హాజరుకావాలని, ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.