ప్రస్తుతం 3.5 ఎకరాల స్థలంలో భక్తుల సౌకర్యార్థం మూడు అంతస్తుల భవనం, తుంగభద్ర బ్రిడ్జి వద్ద 5.2 ఎకరాల్లో మినీ బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 80 శాతం మేర జరిగిన ఈ పనులు మే నెల మొదటి వారంలోగా పూర్తవుతాయని పర్యాటక శాఖ డీఈ ధన్‌రాజ్ తెలిపారు. ఈ భవనంలో ఫస్ట్ ఫేస్‌లో 500 మంది కూర్చొని చూసే విధంగా యాంపీ థియేటర్ నిర్మాణం, ప్రధాన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో విశాలమైన వంటగది, అన్నదాన సత్రం, డైనింగ్ హాల్, ఫుడ్ కోర్టు, టికెట్ కౌంటర్, ఎంట్రెన్స్ లాబీ, ఫోయర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మూడు లిఫ్ట్‌లు, అలాగే తూర్పు, దక్షిణ, ఉత్తరం వైపు విశాలమైన మెట్లు నిర్మించారు. మొదటి అంతస్థులో ఈ ప్రాంత ప్రాముఖ్యతను చాటే విధంగా ఎగ్జిబిషన్ గ్యాలరీ, మల్టీ మీడియా, కల్యాణ మండపం, డైనింగ్ హాల్, వాటికి అనుగుణంగా కార్యాలయం, రెండో అంతస్థులో ఎల్ ఆకారంలో 19 మినీ డీలక్స్ రూంలు నిర్మించారు. ఇందులో బస చేసే యాత్రికులకు నదీతీర ప్రకృతి అందాలు, ఆలయాలు కనిపించేలా భవనాన్ని తీర్చిదిద్దారు. మినీ బస్టాండ్, కల్వర్టు, బిల్డింగ్ నుంచి యోగా నారసింహస్వామి ఆలయం మీదుగా పుష్కర ఘాట్ వరకు వెళ్లేందుకు వీలుగా అప్రోచ్ రోడ్ చేపట్టారు.