
‘ఉపాధి’లో కొత్త పనులు
ఏటూరునాగారం: ఉపాధి హామీలో వర్షాకాలంలో కూలీలతో పనులు చేయించే విధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు శ్రీకారం చుట్టారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబం వందరోజుల పనులను సద్వినియోగం చేసుకునేలా అధికారులు, సిబ్బంది ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. కొత్త పనులకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు ఇవ్వాలని రైతులను కోరారు. అయితే కూలీలు ఎంతగా పెరిగితే అంతా నిధులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. మ్యాన్‌డేస్ పెరిగితేనే ఇతర నిర్మాణాలకు నిధులు ఇచ్చే విధంగా ఈ పథకం రూపకల్పన చేశారు.
ఈజీఎస్‌లో చేసే పనుల వివరాలు
పంటకాల్వలు, చేపల చెరువు, ఇంకుడు గుంతలు, కంపోస్ట్ ఎరువు, పంట పొలాలకు రోడ్ల నిర్మాణం, మొక్కలు పెంచడంతోపాటు పండ్లతోటలు, కొబ్బరి మొక్కలు, పామాయిల్ పెంపకం, మునగ, జామ, బత్తాయి, మామిడి, సపోట, వెదురువనం పెంచడం, మేకలు, గొర్రెల షెడ్డు, కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇవేకాకుండా మరో 18 రకాల పథకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పనులు రైతులకు అనుసంధానం చేయడం వల్ల రైతులకు వ్యవసాయంలో మేలు జరుగుతుంది. భూమి చదునుతోపాటు పథకాలను వర్తింప చేసేందుకు ఈజీఎస్ అధికారులు పల్లెబాట పడుతున్నారు. పంట కాల్వలతో చెరువుల నుంచి నీటిని పొలాలకు పంపించడం, చెరువుల పూడికతీతతో నీటి నిల్వలు, పాంపాండుతో పొలాల చదును, ఇంకుడుగుంతలో భూగర్భజలాలు పెరుగుదల, నాడపు కంపోస్ట్‌తో పంట పొలాలకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మేకలు, గొర్రెల, గేదెల పెంపకానికి షెడ్ల నిర్మాణాలు ఈ పథకంలో చేపట్టనున్నారు.
కూలీలకు ఆర్థిక లాభాలు
ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో కుటుంబం వంద రోజుల పాటు పనులు చేసుకుంటే సుమారు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుంది. దీంతో కుటుంబాలు ఆర్థిక అభివృద్ధితోపాటు సామాజికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. క్యూబిక్‌మీటర్ చొప్పున లెక్క గట్టి ఉపాధి కూలీలకు వేతనాన్ని (కూలీ)ని అందజేస్తారు. దీంతో వారి ఇంటిల్లిపాది పూటగడవడంతోపాటు అవసరాలను తీర్చుకుంటున్నారు.
జిల్లాలో జాబ్‌కార్డులు 55,410
కూలీలు 43,961
పూర్తి చేసిన పనిదినాలు 6,56,688
కూలీలకు మరింత ఉపాధి
ఉపాధి కూలీలకు మరింత ఉపాధిని ఇచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నాం. ఈజీఎస్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రజలను, రైతులను భాగస్వాములను చేస్తున్నాం. దీంతో రైతులకు ఉపయోగపడే పథకాలతో వారికి ఆర్థిక అభివృద్ధి దోహదపడుతుంది.
– వెంకటనారాయణ, ఏపీడీ, ములుగు
వ్యవసాయ రైతులకు ఉపయోగపడేలా రూపకల్పన
వర్షాకాలంలో సైతం
పనులు చేసుకునే అవకాశం
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో
పేదలకు ఆర్థిక లాభాలు
మండలం జాబ్ కూలీలు పని
కార్డులు దినాలు
ఏటూరునాగారం 5,560 2,773 28,190
గోవిందరావుపేట 5,793 3,492 45,173
కన్నాయిగూడెం 3,468 2,576 28,820
మంగపేట 6,874 3,620 42,626
ములుగు 10,708 10,618 1,94,550
తాడ్వాయి 4,248 3,106 35,045
వెంకటాపురం(ఎం) 6,830 4,141 58,454
వెంకటాపురం(కె) 6,291 6,903 1,25,891
వాజేడు 5,638 6,782 97,399

‘ఉపాధి’లో కొత్త పనులు