గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న త‌మిళ స్టార్ హీరో | Vijay Sethupathi Takes Up the Green India Challenge | Sakshi
Sakshi News home page

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న త‌మిళ స్టార్ హీరో

Jul 27 2020 4:09 PM | Updated on Jul 27 2020 4:43 PM

Vijay Sethupathi Takes Up the Green India Challenge - Sakshi

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి  న‌టుడు విజ‌య్ సేతుప‌తి మెక్క‌లు నాటారు. ఉప్పెన సినిమా ద‌ర్శ‌కుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి చెన్నైలోని త‌న నివాసంలో మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెద‌లుపెట్టిన ఎంపీ  జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్ర‌త్యేకంగా అభినందించారు. చాలా మంచి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టార‌ని, అందులో తానూ భాగం అవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.  ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి , ఛాలెంజ్‌కి త‌న‌ని నామినేట్ చేసిన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకి  కృతజ్ఞతలు తెలియజేశారు.
(భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి)

అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. ‘ఉప్పెన’ సినిమాలో తమిళ్ మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటాల్సిందిగా అభిమానుల‌కు పిలుపునిచ్చారు. విజ‌య్ సేతుప‌తి ఇప్ప‌టివ‌ర‌కు పిజ్జా, నేను రౌడినే వంటి తెలుగు రీమేక్‌లలో న‌టించారు. 2009 సైరా న‌ర్సింహారెడ్డిలో మొద‌టిసారిగా తెలుగులో న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం తెలుగులో రెండవ సినిమా ఉప్పెన‌లో న‌టించారు. వైష్ష‌వ్ తేజ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఈ సినిమా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదాప‌డింది. దీంతో ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. (విజయ్‌ సేతుపతికి జంటగా స్వీటీ)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement