ఓటీటీలో 'కీర్తీ సురేష్‌' బాలీవుడ్‌ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్‌ | Varun Dhawan And Keerthy Suresh Baby John Movie OTT Streaming Free | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'కీర్తీ సురేష్‌' బాలీవుడ్‌ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Feb 19 2025 11:00 AM | Updated on Feb 19 2025 11:26 AM

Varun Dhawan And Keerthy Suresh Baby John Movie OTT Streaming Free

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌- కీర్తీ సురేష్‌ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్‌’.. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్‌ యాపిల్‌ పతాకాలపై జ్యోతీ దేశ్‌పాండే, మురాద్‌ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ చిత్రం ఇప్పటికే అమెజాన​్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో చూడొచ్చు.

బేబీ జాన్‌తో కీర్తి సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్‌ కాలేదు. దీంతో తన ఫస్ట్‌ సినిమానే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. 

ఇదే కథతో బేబీ జాన్‌ రీమేక్‌ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్‌ మ్యూజిక్  అందించారు.  ఈ చిత్రం   రూ. 60 కోట్ల గ్రాస్‌ మాత్రమే రాబట్టింది. నెట్‌ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో భారీ డిజాస్టర్‌ లిస్ట్‌లో బేబీ జాన్‌ చేరిపోయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement