ఫోన్‌ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్‌ పెట్టిన అజ్ఞాతవాసి | Urvashi Rautela Phone Is Identified | Sakshi
Sakshi News home page

Urvashi Rautela Phone: ఫోన్‌ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్‌ పెట్టిన అజ్ఞాతవాసి

Oct 19 2023 6:31 PM | Updated on Oct 19 2023 6:50 PM

Urvashi Rautela Phone Is Identified - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్‌ చిత్రాలలో ప్రత్యేక సాంగ్‌తో అలరించిన ఈ మ్యూటీ తెలుగువారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'లో బిగ్‌బాస్‌-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్‌)

దీంతో పోలీస్‌స్టేషన్‌లో కూడ ఫిర్యాదు చేసింది. కానీ తన ప్రయత్నంగా తన ఫోన్‌ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది.  ఈ మేరకు నా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్‌ను కూడా షేర్ చేసింది. 

ఊర్వశి రౌతేలా చేసిన ట్వీట్‌కు ఫలితం దక్కింది. ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్‌ వచ్చింది. 'మీ ఫోన్‌ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి.' అని ఆ వ్యక్తి కండీషన్‌ పెట్టాడు. దీంతో ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్‌ అప్‌ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్‌ తెచ్చి ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement