టాలీవుడ్ ప్రేమకథా చిత్రం చకోర రివ్యూ.. ఎలా ఉందంటే? | Tollywood Movie Chakkora Review In Telugu | Sakshi
Sakshi News home page

Chakkora Review In Telugu: టాలీవుడ్ ప్రేమకథా చిత్రం చకోర రివ్యూ.. ఎలా ఉందంటే?

Oct 9 2026 5:31 PM | Updated on Oct 9 2026 5:36 PM

Tollywood Movie Chakkora Review In Telugu

యువ నటుడు శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాను డాక్టర్ చింతాడ హేమారావు నిర్మించారు. ఇందులో ఇంద్రజ, సుమన్‌, బ్రహ్మాజీ, ఎల్‌బీ శ్రీరామ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రేమ, భావోద్వేగాలు, కామెడీ, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 9, 2026న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

రావణ్‌(శ్రవణ్‌) చిన్నప్పట్నుంచి తనని ఎవరైనా సహాయం కోరితే తన వద్ద ఏముంటే అది ఇచ్చేస్తాడు. అది వాళ్ల తాత నేర్పించారు. అదే ఆచరిస్తుంటాడు. కానీ పెద్దయ్యాక ఫుల్‌ కమర్షియల్‌... డబ్బుల విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి జాబిలి లాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. ఊహించినట్టుగా ఓ రోజు జాబిలి కనిపిస్తుంది. జూలీ(మలైకా టి వాసుపల్‌)ని చూసి ఆమెనే తన జాబిలిగా ఫిక్స్ అయిపోతాడు.  ఆమె ఒక డాక్టర్‌.. ఆమెని పడేసేందుకు రోజూ ప్రయత్నిస్తుంటాడు రావణ్‌. ఓ రోజు ఆమె సవాల్‌ విసరగా.. అందులో సక్సెస్‌ అవుతాడు.  అయితే అంతలోనే పెద్ద ట్విస్ట్ ఉంటుంది. తనని చూడకుండా 24 గంటలు ఉండాలని చెబుతుంది. కానీ ఆ తర్వాత తను కనిపించదు. చివరికీ ఆమెకు పెళ్లయిందని తెలుస్తుంది. మరి జూలీ అలా ఎందుకు చేసింది? ఆమె నిజంగానే రావణ్‌ని ప్రేమించిందా? చివరికి వీరి ప్రేమ సుఖాంతమా? విషాదాంతమా? అన్నదే ఈ సినిమా.

ఎలా ఉందంటే..

సినిమాల్లో ప్రేమకథలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమలోని నిజాయితీ, త్యాగం, భావోద్వేగాలను తెరపై సహజంగా చూపించగలిగితే ఆ కథ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుంది. ఈ మూవీలోనూ అలాంటి స్వచ్ఛమైన ప్రేమనే ప్రధానంగా తీసుకున్నారు. దీనికి కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాలు జోడించారు డైరెక్టర్. అయితే ప్రేమకథలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. కథనం సహజంగా సాగడం, పాత్రల మధ్య అనుబంధం బలంగా కనిపించలేదు.  ప్రేమికుల మధ్య సంఘర్షణలు, వారి నిర్ణయాల వెనుక కారణాలు కథలో కీలకంగా చూపించాడు. కానీ కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా ఎంత బాగా తెరపై ఆవిష్కరిస్తే, సినిమా అంత బాగా ఉంటుంది. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు కొంత వరకు మాత్రమే సక్సెస్‌ అయ్యాడనిపించింది.

అయితే కథ పరంగా కొత్తదనం ఏం లేదు. ఇది రొటీన్‌ లవ్‌ స్టోరీ.  కానీ కథ తీసుకెళ్లిన తీరు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథ నడిపించాడు. ప్రారంభంలో సినిమా కొంత రొటీన్‌గా ఉన్నప్పటికీ.. హీరో హెల్ప్ చేయడం, ఇతరులు ఏదైనా సహాయం అడిగితే వారికి ఉన్నదంతా ఇచ్చేయడమనే పాయింట్‌ చాలా పాత కాన్సెప్ట్‌. కానీ హీరో పెద్దయ్యాక పూర్తి భిన్నంగా కమర్షియల్‌ రంగులు అద్దారు డైరెక్టర్. ఈ విషయంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు.

ఇక తన జాబిలి కోసం కోసం తపించడం, ఆరాటపడటం, ఆమె వెంటపడటం ప్రారంభంలో కొంత విసిగించే సీన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత లవ్‌లోని ఫీల్‌, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా ప్రేక్షకుడికి అనిపించాయి. హీరో ప్రేమని టెస్ట్ చేసే సీన్లు మెప్పిస్తాయి. ఇంటర్వెల్‌ వరకు ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో హీరో చుట్టు తిరుగుతుంది. సెకండాఫ్‌ కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులతో ఆడియన్స్‌లో ఆసక్తి క్రియేట్ చేశాడు. ఈ మూవీలో క్లైమాక్స్ యాక్షన్‌తో పాటు సందేశం ఇచ్చాడు. కానీ చివరికీ కథ విషాదంతో ముగుస్తుంది. ప్రేమకి సంబంధించిన ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది.

ఎవరెలా చేశారంటే..

హీరో శ్రవణ్‌కు తన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. ప్రేమికుడిగా భావోద్వేగాలతో పాటు యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. మలైకా టి. వాసుపల్ హీరోయిన్‌గా తన పాత్రలో ఒదిగిపోయింది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. అనుష్క లుహార్, యామిని, ఎల్.బి. శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్ తమ పాత్రలో పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే రూపా గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రిన్స్ హెన్రీ సంగీతం ఫర్వాలేదు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్‌లో మరింత శ్రద్ధ పెట్టాల్సింది. విజువల్‌గా చూస్తే మూవీ రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. 

 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement