'కంగ్రాట్స్‌..నోబెల్ ప్రైజ్‌కు దరఖాస్తు చేసుకో'.. నెటిజన్‌కు డైరెక్టర్‌ కౌంటర్! | Tollywood Director Harish Sankar Reply To Trolling On Raviteja Song | Sakshi
Sakshi News home page

Harish Sankar: 'నీ పని ఇలానే కొనసాగించు'.. నెటిజన్‌కు హరీశ్ శంకర్ రిప్లై!

Jul 11 2024 11:30 AM | Updated on Jul 11 2024 12:27 PM

Tollywood Director Harish Sankar Reply To Trolling On Raviteja Song

మాస్ మహరాజా రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తోన్న చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాను హరీశ్‌ శంకర్ డైరెక్షన్‌లో‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సితార్‌ అంటూ సాగే సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే ఈ సాంగ్‌పై నెటిజన్స్‌ మాత్రం భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో హీరోయిన్లను కేవలం ఓ వస్తువులాగే చూపిస్తారని మండిపడుతున్నారు. 56 ఏళ్ల రవితేజతో కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్యశ్రీతో అలాంటి స్టెప్స్ వేయింటడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్‌ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

అయితే దీనిపై డైరెక్టర్‌ హరీశ్ శంకర్ స్పందించారు. నెటిజన్‌కు రిప్లై ఇస్తూ..'కంగ్రాట్స్‌.. చాలా బాగా కనిపెట్టావ్.. నోబెల్ ప్రెజ్‌కు దరఖాస్తు చేసుకో.. అంటూ వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు. అంతే కాదు.. దీన్ని నువ్వు ఇలాగే కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్‌ను ప్రశ్నిస్తూ ఉండాలి.. నీలాంటి వారికి ఎప్పుడు వెల్‌కమ్‌ చెబూతూనే ఉంటా' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాలాగే చూడాలంటూ మరికొందరు నెటిజన్స్‌ మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement