Thalapathy Vijay's Speech Highlights at Varisu Audio Launch - Sakshi
Sakshi News home page

Vijay-Rashmika Mandanna: స్టేజ్‌పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్‌, వీడియో వైరల్‌

Jan 3 2023 6:28 PM | Updated on Jan 3 2023 7:05 PM

Thalapathy Vijay About Rashmika Mandanna At Varasudu Audio Launch - Sakshi

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం వారిసు(తెలుగులో వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజగా చిత్రం బృందం ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్‌ రివ్యూ, సెన్సార్‌ టాక్‌ ఎలా ఉందంటే!

స్టేజ్‌ హీరో విజయ్‌, రష్మికకు దిష్టి తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలోని రంజితమే.. రంజితమే.. పాట గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లో ఎక్కడ చూసిన ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు లైవ్‌లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది నటి రష్మిక మందన్నా. అభిమానులకు కోసం డాన్స్‌ చేయాలని కోరడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌తో కలిసి ఆమె ఈ పాటకు కాలు కదిపింది.

చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన పునర్నవి

ఇక రష్మిక డాన్స్‌ చూసి హీరో విజయ్‌తో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.  దీంతో విజయ్‌ స్టేజ్‌పై మాట్లాడుతూ.. రష్మికపై ప్రశంసలు కురిపించాడు. రష్మికను ఉద్దేశిస్తూ.. ఆమె మంచి నటి. రీల్, రియల్‌ లైఫ్‌లోనూ ఒకేలా ఉంటుంది. స్టార్‌ నటి అయిన ఒదిగి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్‌ కోసం అందరి ముందు లైవ్‌లో డాన్స్‌ చేసి ఆకట్టుకుంది. ఆమెపై అందరి దృష్టి పడకుండా దిష్టి తీస్తున్నా’ అంటూ సరదాగా ఆయన తమిళంలో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియోను చూసి రష్మిక ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement