నాకు కోపమొస్తే తెలుగులోనే బూతులు తిడతా..: తమన్నా | Tamannaah Bhatia: I Scold in Telugu Language When iam Angry | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: అందరూ నన్ను తెలుగమ్మాయనుకుంటారు.. కోపం వస్తే తెలుగులోనే తిడతా!

Mar 22 2025 6:08 PM | Updated on Mar 22 2025 6:55 PM

Tamannaah Bhatia: I Scold in Telugu Language When iam Angry

పదిహేనేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఇది 2021లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కింది. హెబ్బా పటేల్‌, వశిష్ట సింహ కీలక పాత్రలు పోషించారు. సంపత్‌ నంది పర్యవేక్షణలో అశోక్‌ తేజ దర్శకత్వం వహించాడు.

శనివారం నాడు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అందులో తమన్నా ముఖం రక్తసిక్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. అందరూ నన్ను తెలుగమ్మాయే అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీలవుతాను. నాకు కోపం వచ్చినప్పుడు తెలుగే మాట్లాడతాను. తెలుగులోనే తిడతాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఓదెల 2 కోసం తమన్నా మాంసాహారం తినడం కూడా మనేసింది.

 

 

చదవండి: నన్ను తిట్టించడం కోసం లక్షలు ఖర్చు చేశారు: పూజా హెగ్డే

Advertisement
 
Advertisement
Advertisement