నో అంటే నో: తాప్సీ | taapsee pannu comments photographer and fans | Sakshi
Sakshi News home page

నో అంటే నో: తాప్సీ

Aug 26 2024 4:01 AM | Updated on Aug 26 2024 4:01 AM

taapsee pannu comments photographer and fans

‘‘నేను నటిని మాత్రమే. పబ్లిక్‌ప్రాపర్టీని కాదు’’ అంటున్నారు హీరోయిన్‌ తాప్సీ. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ (2010) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు తాప్సీ. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా బాలీవుడ్‌ పైనే ఫోకస్‌ పెట్టారు. వరుస హిందీ సినిమాలతో దూసుకెళుతున్న తాప్సీ తాజాగా చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీలను చూసినప్పుడు వారి ఫోటోలు, వీడియోలు తీయడం కోసం ఉత్సాహం చూపుతుటాంటారు.

ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట. అయితే అందుకు ఆమె నో అంటే నో చెప్పారు. ‘‘నేను నటిని మాత్రమే.. పబ్లిక్‌ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్‌ చేయడం చాలా తప్పు. ఎవరైనా నో అని చెబితే వారి అభి్రపాయానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇలా అంటున్నానని కొందరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్‌గా చేస్తున్నావ్‌? అని కామెంట్‌ చేయొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి... అందుకే సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు తాప్సీ. 

Advertisement
 
Advertisement
Advertisement