SushmitaBF: ఊయల తాడు తెగిపోయింది...అపుడు...

Sushmita Sen boyfriend Rohman Shawl sharesa video swing snaps during shoot - Sakshi

ఇష్క్‌ సినిమా షూటింగ్‌ సీన్‌ చిత్రీకరణ దృశ్యాలను షేర్‌ చేసి  రోహ్మన్‌

కొలనులో గోపికతో కృష్ణుని  సీన్ల షూటింగ్‌లో  అనుకోని ఘటన

సాక్షి, ముంబై: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రియుడు కశ్మీరి మోడల్‌, బాలీవుడ్‌ నటుడు రోహ్మాన్ షా షూటింగ్‌లో  అనుకోకుండా ఒక చిన్నప్రమాదంలో ఇరుక్కు న్నాడట. దీనికి సంబంధించిన వీడియోను రోహ్మాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. స్టార్‌హీరో అమీర్ ఖాన్ 1997 నాటి  ఇష్క్ మూవీ షూటింగ్‌  దృశ్యాలను  తాజాగా ఇన్‌స్టా ఖాతాలో  పోస్ట్‌  చేశాడు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఫన్నీ వీడియోను  ఫ్యాన్స్‌కు షేర్‌ చేశాడు.

ఇష్క్‌ మూవీ షూటింగ్‌లో కృష్ణుడి వేషంలో కొలనులో గోపికలతో ఒక సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఈ ఊహించని పరిణామం ఎదురైంది. పువ్వులతో అలంకరించిన  ఒక ఊయలలో  రోహ్మాన్‌ షూట్ కొనసాగుతుండగా, ఒకవైపు తాడు తెగిపోయింది. దీంతో అతను పడిపోబోయాడు. కానీ వెంటనే బ్యాలెన్స్‌ చేసుకొని పడిపోకుండా నొలదొక్కుకున్నాడు. ఈ పరిణామంతో అక్కడున్న సిబ్బంది కాసేపు ఖంగారుపడ్డారని తెలిపాడు. అంతేకాదు త్రిపాఠి నమ్రతా ఆందోళనగా పరిగెత్తుకు రావడాన్నిప్రస్తావించాడు రోహ్మాన్ షా . 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top