సంక్రాంతి బరిలో శివ కార్తికేయన్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా | Sivakarthikeyan Ayalaan Movie Release In 2024 Sankranthi | Sakshi
Sakshi News home page

Sivakarthikeyan Ayalaan: సంక్రాంతి బరిలో శివ కార్తికేయన్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా

Nov 7 2023 1:58 PM | Updated on Nov 7 2023 3:29 PM

Sivakarthikeyan Ayalaan Movie Release In 2024 Sankranthi - Sakshi

కోలీవుడ్‌లో ఇండ్రు నేట్రు నైలై చిత్రంతో దర్శకుడిగా పరిచయమై అనూహ్య విజయాన్ని అందుకున్న దర్శకుడు రవికుమార్‌. ఈయన తాజాగా శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం అయలాన్‌. తెలుగులో కూడా ఇదే పేరుతో విడుదల కానుంది. తొలి చిత్రం తరహాలోనే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది. నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం 2018లోని ప్రారంభమైంది. 24 ఏఎం. స్టూడియోస్‌, కేజేఆర్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు శరత్‌ కేల్కర్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి భానుప్రియ, యోగి బాబు, కరుణాకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇప్పటికే విడుదల కావాల్సింది. అయితే గ్రాఫిక్స్‌ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఎట్టకేలకు చిత్ర విడుదలకు తేదీ ఖరారైంది.

2024 పొంగల్‌ సందర్భంగా అయలాన్‌ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జనవరి 15న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ చిత్ర దర్శకుడు రవికుమార్‌ తన తదుపరి చిత్రం కూడా శివకార్తికేయన్‌నే కథానాయకుడిగా నటించనున్నారని పేర్కొన్నారు. ఆయన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ అయలాన్‌ చిత్రం విడుదల తర్వాత తన కొత్త చిత్రం పనులు ప్రారంభిస్తానన్నారు. ఇది కూడా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే కథ చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement