సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన తమన్‌ | Sakshi
Sakshi News home page

Sai Dharam Tej: సాయి తేజ్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చిన తమన్‌

Published Thu, Sep 30 2021 2:23 PM

Sai Dharam Tej Latest Health Update Revealed By S Thaman - Sakshi

Sai Dharam Tej Is Recovering Reveals SS Thaman: సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన రిపబ్లిక్‌ మూవీ అక్టోబర్‌1న విడుదల కానుంది.  దేవాకట్టా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సమయంలో సెప్టెంబర్ 10న యాక్సిడెంట్ సాయితేజ్‌కు యాక్సిడెంట్‌ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.

కొన్ని రోజుల క్రితం సాయి తేజ్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌ లేదు. రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సాయితేజ్‌ ఆరోగ్యంపై పవన్‌ కల్యాణ్‌ అన్న మాటలు ఫ్యాన్స్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.

దీంతో సాయితేజ్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇవ్వాల్సిందిగా అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున రిక్వెస్టులు చేస్తున్నారు. తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ స్పందించారు. 'నా నన్భన్‌(స్నేహితుడు) కోలుకుంటున్నాడు. అప్‌డేట్‌ ఇచ్చినందుకు తేజ్‌  మ్యానెజర్‌ బి.కే.ఆర్. సతీశ్‌కు ధన్యవాదాలు. త్వరలోనే నా స్నేహితుడ్ని కలుస్తున్నందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నాను అంటూ' తమన్‌ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement