అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం: రాశీ ఖన్నా | Raashii Khanna Open Comments About Doing South India Films, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Raashii Khanna: సౌత్‌లో అలాంటి సినిమాలు చేయడమే ఇష్టం: రాశీ ఖన్నా

Jan 28 2025 9:03 PM | Updated on Jan 29 2025 11:39 AM

Raashii Khanna Open About on Doing South India Films

హీరోయిన్ రాశి ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్‌ ఎదుగుదలకు ఊపయోగపడతుందని తెలిపింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్‌ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో నటించడంపై రాశీ ఖన్నా మాట్లాడింది.

రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్‌ ఉండదు.' అని పంచుకున్నారు.

కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు,  తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో  రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్‌గా చేయనుంది. కాగా.. రాశి ఖన్నా చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్‌లో కనిపించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement