ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్‌.. అది రెబల్ స్టార్‌ క్రేజ్‌! | Prabhas The RajaSaab Glimpse Gets Huge Response In Youtube | Sakshi
Sakshi News home page

The RajaSaab Movie: 'ది రాజాసాబ్' గ్లింప్స్‌.. 24 గంటల్లోనే షేక్‌!

Jul 30 2024 8:46 PM | Updated on Jul 30 2024 8:46 PM

Prabhas The RajaSaab Glimpse Gets Huge Response In Youtube

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్‌'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. గ్లింప్స్‌ విడుదలైన 24 గంటల్లోనే  20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ప్రభాస్ వింటేజ్ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి సరికొత్తగా ప్రభాస్‌ను చూపించనున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా  స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement