
నీ భర్త ఎక్కడ? మీరు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారు?
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. పైగా చైతన్య పెళ్లి ఫోటోలన్నింటనీ డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దీనికితోడు గతంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నిహారిక కొంతకాలం నుంచి సైలెంట్ అయిపోయింది.
డిసెంబర్‌లో చివరిసారిగా వీడియో షేర్ చేసిన ఆమె ఇటీవలే తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను సైతం పంచుకుంది. వీడియోల సంగతి పక్కనపెడితే నిహారిక చివరిసారిగా నవంబర్ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఆ తర్వాత ఎటువంటి పిక్స్ పోస్ట్ చేయలేదు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఫోటోస్ అప్‌లోడ్ చేసింది నిహారిక. లంగా వోణీలో ట్రెడిషనల్‌గా రెడీ అయిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
తన ఫోటోలు చూసి ఎంతందంగా ఉన్నావో అని అభిమానులు కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం నీ భర్త ఎక్కడ? మీరు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారు? అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం.. మళ్లీ విడాకులు తీసుకోవడం.. ఏంటో! అని వ్యంగ్యాస్త్రాలు సంధించగా ఆమె పెట్టిన ఫోటోలకు నీ కామెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా? అంటూ నిహారిక ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.