Niharika Konidela Husband Chaitanya Not Deleted This Photo On His Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika- Chaitanya: పెళ్లి ఫోటోలు డిలీట్‌, కానీ ఆ ఒక్కటి మాత్రం తొలగించని చైతన్య

Mar 20 2023 12:38 PM | Updated on Mar 20 2023 12:57 PM

Niharika Konidela Husband Chaitanya Not Deleted This Photo On His Instagram - Sakshi

ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు మొదలైన నేపథ్యంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా నిహారిక, చైతన్య 2020 ఆగస్టు 13న నిశ్చితార్థం చేసుకున్నారు.

మెగా డాటర్‌ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడిపోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నిహారిక ఈ మధ్య తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేయడమే లేదు. అటు చైతన్య కూడా నిహారికతో ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. దీనికితోడు సోషల్‌ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. పైగా చైతన్య పెళ్లి ఫోటోలు సైతం డిలీట్‌ చేశాడు. నిహారికతో కలిసి దిగిన పిక్స్‌ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలగించాడు. అయితే ఒక్క ఫోటో మాత్రం అలాగే ఉంచాడు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోల్డెన్‌ రిట్రైవర్‌ జాతికి చెందిన కుక్కపిల్ల బజ్‌తో నిహారిక దిగిన ఫోటో అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ ఉంది.

ఈ ఫోటో 2020 డిసెంబర్‌ 18న అప్‌లోడ్‌ చేశాడు. ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు మొదలైన నేపథ్యంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా నిహారిక, చైతన్య 2020 ఆగస్టు 13న నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా కారణంగా పెళ్లి కొంత ఆలస్యమైంది. ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్‌ 9న ఈ జంట పెళ్లి పీటలెక్కింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ వీరి వివాహానికి వేడుకగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement