‘సన్నాఫ్‌ ఇండియా’ షూటింగ్‌‌‌ ప్రారంభం

Mohan Babu Son Of India Movie Shoot Begins In Hyderabad - Sakshi

సన్నాఫ్‌ ఇండియా మూవీ: స్టైలిస్ట్‌గా మంచు వారి కోడలు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రకటించిన ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ యూనిట్‌. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌‌ నేడు లాంఛనంగా ప్రారంభమైనట్లు వెల్లడించింది. కాగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మోహ‌న్‌బాబు, ‘సన్నాఫ్‌ ఇండియా’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. (చదవండి: 'బిల్లా-రంగా' రీమేక్‌‌లో వార‌సులు)

ఇక మంచు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో విష్ణు సతీమణి విరానిక స్టైలిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుకు ఆమె స్టైలింగ్‌ చేయనున్నారు. కాగా ‘సన్నాఫ్‌ ఇండియా’ షూటింగ్‌ ప్రారంభమైన సందర్భంగా, మోహన్‌బాబు తనయ, నటి మంచు లక్ష్మి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కంగ్రాట్స్‌ డాడీ! ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయింట్‌గా ఎదురు చూస్తున్నా! బెస్ట్‌ ఆఫ్‌ లక్‌, నాకు తెలుసు మీ అత్యద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తారు’’అంటూ ట్వీట్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top