నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య | Kiran Rao Comments On Aamir Khan Divorce With Reena Dutta | Sakshi
Sakshi News home page

Aamir Khan: చాన్నాళ్ల తర్వాత నిజాలు బయటపెట్టిన ఆమిర్ మాజీ భార్య!

Mar 13 2024 12:31 PM | Updated on Mar 13 2024 1:25 PM

Kiran Rao Comments On Aamir Khan Divorce With Reena Dutta - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొంతలో కొంత తెలుసు. అప్పట్లో రీనా దత్తా అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 16 ఏళ్లపాటు కలిసున్లారు. కానీ ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు కిరణ్ రావ్ అనే దర్శకురాలితో ఏడడుగులు వేశాడు. అయితే తొలి భార్య నుంచి విడిపోవడానికి రెండో భార్యనే కారణమని చాలామంది విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ విషయమై స్వయంగా కిరణ్ రావ్ స్పందించింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?)

''లగాన్' షూటింగ్ టైంలోనే నేను-ఆమిర్ కనెక్ట్ అయ్యామని చాలామంది భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. 'స్వేడ్స్' సినిమా చేస్తున్నప్పుడు మళ్లీ కలిశాం. కొన్ని కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తూ దగ్గరయ్యాం. 'లగాన్' చేసిన 3-4 ఏళ్ల వరకు మేమిద్దరం కనీసం టచ్‌లో కూడా లేము. ఇంకా చెప్పాలంటే 'లగాన్' షూటింగ్ టైంలో ఒకటో రెండుసార్లు మాట్లాడి ఉంటా అంతే! 2004లో మేము డేటింగ్ మొదలుపెట్టాం. కానీ చాలామంది 'లగాన్' టైంలోనే దగ్గరయ్యామని.. ఆమిర్, రీనాకు విడాకులు ఇచ్చేయాడానికి నేనే కారణమని అంటున్నారు. కానీ అదంతా అబద్ధం' అని కిరణ్ రావు చెప్పుకొచ్చింది.

లగాన్ సినిమా 2001లో రిలీజైంది. ఇది వచ్చిన తర్వాత ఏడాది తర్వాత అంటే 2002లో ఆమిర్ ఖాన్.. తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చేశాడు. 2005లో దర్శకురాలు కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆమిర్, తన తొలి భార్యకు విడాకులు ఇవ్వడానికి రీనానే కారణమనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు)

Advertisement
 
Advertisement
Advertisement