స్ఫూర్తిదాయక పోరాటం | Keerthy Suresh Raghu Thatha Movie Release Date Out, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

స్ఫూర్తిదాయక పోరాటం

Jun 1 2024 12:28 AM | Updated on Jun 1 2024 1:38 PM

Keerthy Suresh Raghu Thatha gets a release date

రెగ్యులర్‌ కమర్షియల్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ కూడా చేస్తుంటారు హీరోయిన్‌ కీర్తీ సురేష్‌. ‘మహానటి’, ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ వంటి ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘రఘు తాత’. కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ఈ సినిమాకు సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

‘సలార్, కేజీఎఫ్‌’ వంటి సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ నిర్మించిన తొలి తమిళ సినిమా ఇది. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఈ సినిమా కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది... నవ్విస్తుంది... స్ఫూర్తి కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు కీర్తీ సురేష్‌. ఒక సామాజిక అంశంతో ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయక పోరాటం నేపథ్యంలో ‘రఘు తాత’ ఉంటుందని టాక్‌. తెలుగు, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్‌ కానుందట.

Advertisement
 
Advertisement
Advertisement