సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘కర్మణ్యే వాధికారస్తే’ | Karmanye Vadhikaraste: Suspense Thriller Starring Brahmaji, Shatru & Mahendran Releasing on Sept 19 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్‌గా ‘కర్మణ్యే వాధికారస్తే’

Aug 27 2025 6:30 PM | Updated on Aug 27 2025 6:35 PM

Karmanye Vadhikaraste Movie Release Date Out

బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం కర్మణ్యే వాధికారస్తే. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం  సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ ‘కర్మణ్యే వాధికారస్తే' అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం "పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు". టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.

ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధం గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement