
‘ఇండియన్ 2’ సినిమా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలైన పాతిక సంవత్సరాల తర్వాత లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను ఆరంభించారు కమల్–శంకర్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పెద్ద ప్రమాదం జరగడం, ఆ తర్వాత బడ్జెట్ విషయంలో దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకాకు మధ్య అభిప్రాయభేదాలు రావడంతో షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
తాజాగా ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ బుధవారం తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ‘‘సెప్టెంబరు నుంచి ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాను’’ అని పేర్కొన్నారు కమల్‌హాసన్. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా ఇతర ముఖ్యతారాగణంగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Good morning Indians, we are glad to announce that the remaining shoot for Indian 2 is commencing today! Need all of your support and wishes 🙏🧿 https://t.co/s1CjKSGXYM
— Shankar Shanmugham (@shankarshanmugh) August 23, 2022