'కల్కి' పార్ట్ 2.. టైటిల్ ఫిక్స్ అయిందా? | Kalki 2898 AD Movie Part 2 Latest Updates | Sakshi
Sakshi News home page

Kalki 2: 'కల్కి 2'.. భవిష్యత్ నుంచి గతంలోకి

Sep 22 2024 2:05 PM | Updated on Sep 22 2024 2:56 PM

Kalki 2898 AD Movie Part 2 Latest Updates

ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఈ ఏడాది 'కల్కి 2898'తో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా.. మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని గాసిప్స్ వైరల్ అయిపోతున్నాయి. టైటిల్‌ని ఫిక్స్ చేయడంతో పాటు స్టోరీ ఎలా ఉండబోతుందో మాట్లాడేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: పిల్ల దెయ్యం సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్)

ఇప్పటికే వచ్చిన 'కల్కి' తొలి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని చెప్పొచ్చు.

ఎందుకంటే సీక్వెల్‌కి 'కర్ణ 3102 BC' అనే టైటిల్ నిర్ణయించారట. పేరు బట్టే అర్థమైపోతుందిగా.. మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట. ఉన‍్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. రాబోయే జనవరి నుంచి షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్)

Advertisement
 
Advertisement
Advertisement