Jr NTR and Ram Charan Reaction After Watching RRR Movie - Sakshi
Sakshi News home page

RRR Movie: థియేటర్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సందడి

Mar 25 2022 9:54 AM | Updated on Mar 25 2022 11:32 AM

Jr NTR and Ram Charan Reaction After Watching RRR Movie - Sakshi

హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూడగా భ్రమరాంబ థియేటర్‌లో రామ్‌చరణ్‌ సినిమా చూశారు.  సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్‌ బయటకు వస్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ సంజ్ఞ చేశాడు. మాటల్లేవని, సూపర్‌ హిట్‌ అని సంకేతాలిచ్చాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). భారీ అంచనాల మధ్య శుక్రవారం (మార్చి 25) విడుదలైందీ సినిమా. దాదాపు మూడేళ్ల తర్వాత అభిమాన హీరోలు వెండితెరపై కనిపించడంతో ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరోపక్క సినిమా రిలీజ్‌ సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ థియేటర్‌కు వెళ్లి సందడి చేశారు.

హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో కలిసి మూవీ చూడగా భ్రమరాంబ థియేటర్‌లో రామ్‌చరణ్‌, రాజమౌళి ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. సినిమా చూసిన అనంతరం ఎన్టీఆర్‌ బయటకు వస్తూ సినిమా అద్భుతంగా ఉందంటూ సంజ్ఞ చేశాడు. మాటల్లేవని, సూపర్‌ హిట్‌ అంటూ సంకేతాలిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చదవండి: ఫ్యాన్స్‌పై పేపర్లు విసురుతూ థియేటర్‌లో రచ్చ చేసిన ఉపాసన

కోపంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టికెట్లను చించేసిన అభిమానులు..!

Advertisement
 
Advertisement
Advertisement