నిద ప్రోవద్దు!  | Dont Sleep teaser launch by Naga Chaitanya, Vijay Sethupathi, Dulquer Salmaan | Sakshi
Sakshi News home page

నిద ప్రోవద్దు! 

Oct 15 2026 3:51 AM | Updated on Oct 15 2026 3:51 AM

Dont Sleep teaser launch by Naga Chaitanya, Vijay Sethupathi, Dulquer Salmaan

మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్‌ లైట్స్‌’ మూవీతో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్‌ షామ్‌ దత్‌ ‘డోంట్‌ స్లీప్‌’ (నిద ప్రోవద్దు) చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ సినిమాతో ఆకట్టుకున్న ఇంద్ర రామ్‌ హీరోగా వీ డ్రీమ్‌ ఫిలిమ్స్‌ పై వి. చుడామణి నిర్మిస్తున్నారు. 

ఈ మూవీలో ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, రవీంద్ర విజయ్, తబా రీమా, జోయీతా బెనర్జీ, సునీల్‌ థాపా, ఆడుకలం నరేన్, కల్పలత, అనీష్‌ కురువిల్లా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరోలు నాగచైతన్య, విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్స్‌ కల్యాణ్‌ శంకర్, దేవ కట్టా, శ్రీరామ్‌ ఆదిత్య, రాధాకృష్ణ, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ అతిథులుగా హాజరై, ‘స్ట్రీట్‌ లైట్స్‌’ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

ఇంద్ర రామ్‌ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘డోంట్‌ స్లీప్‌’.  సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా హిట్‌ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ‘‘ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. చాలా కొత్త కథ. ఇంద్ర రామ్‌ లాంటి ΄్యాషనేట్‌ యాక్టర్‌ దొరకడం నాకు సంతోషంగా అనిపించింది’’ అని షామ్‌ దత్‌ చెప్పారు. ‘‘డోంట్‌ స్లీప్‌’ తెలుగులో నా తొలి సినిమా’’ అన్నారు హీరోయిన్‌ జోయీతా బెనర్జీ. ‘‘తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అనీష్‌ కురువిల్లా పేర్కొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement