Naga Chaitanya Sings Manmadhudu Movie Dont Marry Be Happy Song Video Goes Viral - Sakshi
Sakshi News home page

Naga Chaitanya Video: పెళ్లి చేసుకోవద్దంటున్న చైతూ.. వీడియో వైరల్‌

Jan 12 2022 8:43 PM | Updated on Jan 13 2022 11:35 AM

Dont Marry Be Happy Sings By Naga Chaitanya Video Goes Viral - Sakshi

Dont Marry Be Happy Sings By Naga Chaitanya Video Goes Viral: స్టార్‌ హీరోయిన్‌ సమంతతో అక్కినేని నాగ చైతన్య విడాకుల తర్వాత వీరిద్దరిపై అందరి దృష్టి కాస్త ఎక్కువగానే ఉంది. ఈ ఇద్దరి గురించి వచ్చే ఏ వార్తయిన వైరల్‌గా మారుతోంది. సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తన ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో అనేక పోస్టులు, వీడియోలు షేర్‌ చేస్తూ తనవైపు అటెన్షన్‌ క్రియేట్‌ చేసుకుంటోంది. అలాగే నాగ చైతన్య కూడా మూవీస్‌తో బిజీగా ఉంటున్నాడు. ఇటీవల బంగార్రాజు చిత్రబృందం మ్యూజికల్‌ నైట్స్‌ అనే ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో హీరోయిన్‌ దక్షా నాగార్కర్‌ చిలిపి చేష్టలకు చై సిగ్గుపడుతూ కనిపించిన వీడియో మాములుగా వైరల్‌ కాలేదు. 

తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన మరొక వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగర్రాజు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో వీరిద్దరూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక ప్రముఖ ఛానెల్‌ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు నాగార్జున, నాగ చైతన్య. వీరితోపాటు కృతి శెట్టి కూడా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో మన్మథుడు సినిమాలోని 'డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ' అంటూ చై జోష్‌గా పాట పాడటం ఆసక్తిరేపుతోందు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 



ఇదీ చదవండి: అందుకే విడిపోయాం.. విడాకులపై చై ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement