దేవర టికెట్లు 5 నిమిషాల్లో క్లోజ్‌.. మూడో సాంగ్‌పై అప్‌డేట్‌ | Devara Third Song Release Date Locked | Sakshi
Sakshi News home page

దేవర టికెట్లు 5 నిమిషాల్లో క్లోజ్‌.. మూడో సాంగ్‌పై అప్‌డేట్‌

Sep 2 2024 8:07 PM | Updated on Sep 2 2024 8:26 PM

Devara Third Song Release Date Locked

స్టార్‌ హీరో ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా చిత్రం  'దేవర'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్‌ టికెట్ల విక్రయాలు అమెరికాలో ప్రారంభమయ్యాయి. అక్కడ భారీగా బుకింగ్స్‌ జరిగాయి. అయితే, తాజాగా కెనాడాలో సుమారు 30 స్క్రీన్లకు సంబంధించి టికెట్లు ఓపెన్‌ అయ్యాయి. అయితే, కేవలం 5నిమిషాల్లోనే టికెట్లు అన్నీ పూర్తిగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో తారక్‌ సినిమా క్రేజ్‌ ఏంటో ప్రపంచానికి తెలుస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

దేవర పాటలతోనే అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు తారక్‌.. ఇప్పటికే  రిలీజైన పాటలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. యూట్యూబ్ లో అనేక రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్‌లో  ఎన్టీఆర్ - జాన్వీ  జోడీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఫియర్‌ సాంగ్‌ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. అయితే, తాజాగా దేవర నుంచి మూడో పాటను సెప్టెంబర్‌ 4న విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మాస్‌ డ్యుయెట్‌కు  విజిల్స్‌ వేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ఎన్టీఆర్ - జాన్వీ పోస్టర్‌ను విడుదల చేశారు.  

దేవర రెండు భాగాలుగా రానుంది. కొరటాల తెరకెక్కిస్తున్న  ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్‌, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement