చాలా రోజుల తర్వాత.. సంతోషంగా ఉంది! | Deepika Padukone And Ranveer Singh Dance Together In Their First Ad | Sakshi
Sakshi News home page

చాలా రోజుల తర్వాత.. సంతోషంగా ఉంది!

Nov 7 2020 5:36 PM | Updated on Nov 7 2020 5:43 PM

Deepika Padukone And Ranveer Singh Dance Together In Their First Ad - Sakshi

ముంబై: ‘రామ్‌లీలా’, ‘పద్మావతి’ సినిమాలతో అభిమానులను మెప్పించిన బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌లు చాలా రోజుల తర్వాత ఓ ప్రకటనతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చారు. ఎన్నో రోజుల తర్వాత తమ అభిమాన జంటను ఒకే స్రీన్‌పై చూసి వారి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టెలికాం బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను రణ్‌వీర్ శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో దీపికా, రణ్‌వీర్‌లు పెప్పి పాటకు డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల టీం ఆటగాళ్లు కనిపించారు. (చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్‌!)

దీపికా, రణ్‌వీర్‌ డ్యాన్స్‌ హుషారుగా డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో మధ్యలో ఐపీఎల్‌ ఆటగాళ్లు  కూడా స్టెప్పులేస్తున్న ఈ వీడియో దీపికా, రణ్‌వీర్‌ అభిమానులతో పాటు క్రికెట్‌ అభిమానులను కూడా తెగ ఆకట్టుకుంటోంది. ఇక లాక్‌డౌన్‌  తర్వాత దీపికా, రణ్‌వీర్‌లు మొదటిసారిగా స్క్రీన్‌పై కనిపించడంతో ‘మరోసారి మీ ఇద్దరి కెమిస్ట్రీ ఉత్తమైనదని నిరూపించారు. త్వరలోనే మరో కొత్త సినిమాను ప్రకటిస్తారని ఆశిస్తున్నాం’, ‘ఎన్నో రోజుల తర్వాత మీ జంటను ఒకే స్రీన్‌పై చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. (చదవండి: మరోసారి క్రేజీ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన స్టార్‌ హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement