Chiranjeevi Wishes To Allu Arjun For Completing 20 Years In Film Industry, Tweet Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun-Chiranjeevi: అల్లు అర్జున్‌పై చిరు ట్వీట్‌, ఇప్పటికి ఆ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి..

Mar 29 2023 1:37 PM | Updated on Mar 29 2023 3:09 PM

Chiranjeevi Wishes to Allu Arjun For Completing 20 years in Film Industry - Sakshi

ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. మెగా-అల్లు వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన బన్నీ పాన్‌ ఇండియా, స్టైలిష్‌ స్టార్‌, ఐకాన్‌ స్టార్‌గా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేస్తుకున్నాడు. నటనలో, డాన్స్‌లో తన మామ(మెగాస్టార్‌ చిరంజీవికి) తగ్గ అల్లుడిగా అనిపించుకున్నాడు. ఇదిలా మంగళవారంతో బన్నీ సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు.  రెండు దశాబ్దాలుగా సినిమాలో దూసుకుపోతున్న బన్నీ సినిమా సినిమాను తన గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇక బన్నీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి శభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

చదవండి: బిగ్‌బాస్‌ 7లోకి బుల్లితెర హీరో అమర్‌దీప్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు

ఈ ప్రయాణంలో బన్నీ సాధించిన విజయాలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘డియర్‌ బన్నీ(అల్లు అర్జున్‌) సినీ పరిశ్రమలో నువ్వు 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నీ చిన్ననాటి రోజులు నా మదిలో ఇంకా అలాగే ఉన్నాయి. కానీ, కాలం ఎంత తొందరగా గడుస్తోంది కదా. ఓ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన నువ్వు నీ కెరీర్‌ని ఎంత అద్భుతంగా మలుచుకున్నావు. సాధారణ నటుడు నుంచి ఐకాన్‌ స్టార్‌, పాన్‌ ఇండియా స్టార్‌గా నీ ఎదుగుదల చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో నువ్వు మరెన్నో విజయాలు, ఎందరో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ చిరంజీవి విషెస్‌ తెలిపారు.

చదవండి: బర్త్‌డే రోజున చరణ్‌ ధరించిన ఈ షర్ట్‌ ధరెంతో తెలుసా?

చిరు ట్వీట్‌పై బన్నీ స్పందించాడు. మీ అద్భుతమైన ఆశీర్వాదం, శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ నేను మీపై కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాను. థ్యాంక్యూ (Thank you chikababi)’ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కాగా చిరంజీవి నటించిన విజేత చిత్రంలో బన్నీ బాలనటుడిగా నటించగా.. డాడీ సినిమాల్లో కీ రోల్‌ పోషించాడు. ‘గంగోత్రి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ క్లాస్‌, మాస్‌ ప్రేక్షకులను అలరిస్తూ స్టైలిష్‌ స్టార్‌గా ఎదిగాడు. 2021లో విడుదలైన ‘పుష్ప’ఐకాన్‌స్టార్‌, పాన్‌ ఇండియా స్టార్‌ మారాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement