Sree Leela: Pelli SandaDI Heroine Demands Rs 1 Cr Remuneration Deets Inside - Sakshi
Sakshi News home page

Sreeleela: ఒక్క సినిమాతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల!

Feb 4 2022 2:25 PM | Updated on Feb 4 2022 2:52 PM

Buzz: Heroine Sreeleela Demands Rs 1 Cr Remuneration - Sakshi

పెళ్లి సందD మూవీకి రూ.5 లక్షల పారితోషికం అందుకుంది శ్రీలీల. ఈ సినిమా మరీ అంతగా విజయం అందుకోకపోయినప్పటికీ తన రెండో సినిమాకు ఏకంగా రూ.40 లక్షలు తీసుకుందట. ఈ మధ్యే మూడో సినిమా కోసం...

టాలీవుడ్‌కు ఎందరో హీరోయిన్స్‌ను పరిచయం చేసిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుదే! తెరపై కథానాయికలను ఆయన చూపించినంత అందంగా మరే డైరెక్టర్‌ చూపించలేడంటే అతిశయోక్తి కాదు. ఇటీవల పెళ్లి సందD మూవీతో శ్రీలీలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో నటనతో అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందీ కన్నడ భామ. తొలి సినిమా హిట్‌ అవ్వడంతో తన రెమ్యునరేషన్‌ను బీభత్సంగా పెంచేసిందీ బ్యూటీ.

పెళ్లి సందD మూవీకి రూ.5 లక్షల పారితోషికం అందుకుంది శ్రీలీల. ఈ సినిమా మరీ అంతగా విజయం అందుకోకపోయినప్పటికీ తన రెండో సినిమాకు ఏకంగా రూ.40 లక్షలు తీసుకుందట. ఈ మధ్యే మూడో సినిమాకు సైతం సంతకం చేసిన ఈ భామ మరో పాతిక లక్షలు పెంచేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట చేయబోయే సినిమాలకైతే ఏకంగా కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తానంటోందట. ఆమె దూకుడు చూసి దర్శకనిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement