హీరోగా బండ్ల గణేశ్‌, మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

Bandla Ganesh Movie Title Is Degala Babji First Look Out - Sakshi

బండ్ల గణేశ్ హీరోగా ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ సందర్భంగా ఈ మూవీకి ‘డేగల బాజ్జీ’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు హరీశ్ శంకర్ చేతుల మీదుగా ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కను బొమ్మపై గాయం, ఒక్క కన్నుతో సీరియస్‌గా చూస్తున్న బండ్ల గణేశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ ఫస్టులుక్ విడుదల చేసిన హరీశ్ శంకర్, బండ్ల గణేశ్‌తో పాటు, మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top